ఆర్బీఐ రుణ పైలట్ ప్రాజెక్టుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం

  • రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా ఆర్బీఐ PTPFC పైలట్ ప్రాజెక్టు
  • ఇండోర్ వేదికగా జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • PTPFC పైలట్ ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించిన వ్యాపారవేత్త
రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేలా ఆర్బీఐ సరికొత్తగా పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్‌ను తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించి పైలట్ ప్రాజెక్టును ఆర్బీఐ బోర్డు మీటింగ్‌లో ప్రదర్శించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ ఆర్బీఐ ప్రాజెక్టు అద్భుతమంటూ కితాబునిచ్చారు.

సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఈ సమావేశానికి ఆనంద్ మహీంద్రా కూడా హాజరయ్యారు. 

కొన్నిసార్లు ముందు వరుసలో సీట్లు పొందడం ఆనందంగా ఉంటందని, శనివారం ఇండోర్‌లో జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేసంలో పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రిక్షన్‌లెస్ క్రెడిట్ పైలట్ ప్రాజెక్టును ప్రదర్శించారని, దీంతో రుణ మంజూరు ప్రక్రియ రోజుల నుండి నిమిషాలకు తగ్గిపోతుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది ఓపెన్ ప్లాట్ ఫామ్ కాబట్టి అన్ని బ్యాంకులకు అందుబాటులో ఉంటుందని, భారత్ మళ్లీ డిజిటల్ పోల్ పొజిషన్‌ను తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆర్బీఐకి అభినందనలు తెలిపారు.

రుణగ్రహీతలు, రుణ సంస్థలను అనుసంధానించి తక్కువ మొత్తంలో రుణం తీసుకోవాలనుకునే వారికి రుణాలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆర్బీఐ పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్ ఫర్ ప్రిక్షన్‌లెస్ క్రెడిట్ పైలట్ (PTPFC) రూపొందించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా రూ.1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, ఎంఎస్ఎంఈలకు నాన్-కొలేటరల్ ఆధారిత రుణాలు, హోమ్ లోన్లు, డెయిరీ రుణాలు, వ్యక్తిగత రుణాల మంజూరులో సహాయపడుతుంది.


More Telugu News