కొందరు దాన్ని వివాదంగా మార్చారు: రానా
- ఇటీవల 69వ జాతీయ అవార్డుల ప్రకటన
- పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు
- జై భీమ్ లో నటనకు సూర్యకు అవార్డు ఇచ్చి ఉండాల్సిందని పలువురి అభిప్రాయం
- ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయన్న రానా
ఇటీవల 69వ జాతీయ అవార్డుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో జై భీమ్ చిత్రంలో నటనకు గాను సూర్యకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇస్తే బాగుండేదని చాలామంది వ్యాఖ్యలు చేశారు. దీనిపై టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పందించారు.
సైమా అవార్డుల ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, జై భీమ్ చిత్రానికి అవార్డు వస్తుందని చాలా మంది భావించారని, కానీ ఆ చిత్రానికి అవార్డు రాలేదని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కొందరు తమ అభిప్రాయాలను తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, అయితే, వివాదం సృష్టించాలని వారు ఆ పోస్టులు పెట్టలేదని అన్నారు. కొందరు ఇతరులు మాత్రమే ఈ వ్యవహారాన్ని వివాదాస్పంగా మార్చారని రానా విమర్శించారు.
నటుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని స్పష్టం చేశారు. సినిమాల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చని, ఒకరికి నచ్చిన సినిమా మరొకరికి నచ్చకపోవచ్చని రానా వ్యాఖ్యానించారు. నటులు కూడా ఇదే తరహాలో అభిప్రాయాలను కలిగి ఉంటారని వివరించారు.
జై భీమ్ కు అవార్డు రాకపోవడంతో నేచురల్ స్టార్ నాని తీవ్ర నిరాశతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం తెలిసిందే.