మొన్న రనౌటై ట్రోలింగ్ కు బలి.. నేడు 45 బంతుల్లోనే సెంచరీతో సమాధానం చెప్పిన విండీస్​ బాహుబలి

  • కరీబియన్‌ ప్రీమియర్‌‌ లీగ్‌లో రఖీమ్ కార్న్‌వాల్ మెరుపులు
  • బార్బడోస్‌ రాయల్స్‌ తరఫున మెరుపు సెంచరీ
  • 221 పరుగుల లక్ష్యం ఛేదించిన బార్బడోస్ జట్టు
వెస్టిండీస్ భారీ కాయుడు, క్రికెట్ బాహుబలి రఖీమ్ కార్న్‌వాల్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెంచరీతో దుమ్మురేపాడు. బార్బడోస్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన అతను సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లోనే అద్భుత శతకం సాధించాడు. గత మ్యాచ్ లో పేలవ రీతిలో రనౌటై ట్రోలింగ్ కు గురైన కార్న్వాల్ వెంటనే సెంచరీ కొట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఈ మ్యాచ్‌లో రాయల్స్ విజయానికి 221 పరుగులు అవసరం అవగా.. కార్న్‌వాల్ 4 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు బాదాడు. 

48 బంతుల్లోనే 102 పరుగులు చేసి రిటైర్డ్ అయి జట్టును గెలిపించాడు. కొన్ని రోజుల క్రితం తన రనౌట్ పై విమర్శలన్నింటికీ ప్రతిస్పందనగా  సెంచరీ పూర్తవ్వగానే బ్యాట్-డ్రాప్ సెలబ్రేషన్స్ చేశాడు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తన కుమారుడికి ఈ అవార్డును అంకితం ఇచ్చాడు.


More Telugu News