దయచేసి.. ఉదయాన్నే ఈ టిఫిన్ల జోలికి వెళ్లకండి!

  • కాఫీ, టీలకు దూరంగా ఉండాలి
  • తప్పదనుకుంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు
  • పండ్ల రసానికి బదులు పండు తినాలి
ఉదయం తీసుకునే ఆహారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు నాణ్యతను ఉదయం వేళలే నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఉదయం పెద్దగా పోషకాలు లేని, కార్బో హైడ్రేట్లు ఎక్కువగా, ఫ్యాట్స్, షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే శక్తి తగ్గుతుంది. రోజంతా నీరసంగా ఉంటారు. కొందరిలో రక్తంలో షుగర్, బీపీ పెరిగిపోతాయి. కానీ, మంచి పోషకాలు, పీచుతో కూడిన ఆహారం తీసుకుంటే చురుగ్గా, శక్తిమంతంగా ఉంటారు. సరైన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉన్న తటస్థ ఆహారాన్ని తీసుకోవాలి.

కాఫీ
ఉదయం కాఫీ తాగే అలవాటుతో కార్టిసోన్ స్థాయులు శరీరంలో పెరిగిపోతాయి. మనల్ని చురుగ్గా ఉంచేందుకు వీలుగా ఈ కార్టిసోన్ హార్మోన్ ను అప్పటికే మన శరీరం విడుదల చేస్తుంది. కాఫీ తాగడంతో కార్టిసోన్ మరింత పెరిగిపోతుంది. దీంతో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. రక్తపోటు పెరగొచ్చు. కాఫీ తాగకుండా ఉండేలకపోతుంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత తీసుకోవచ్చు. 

పండ్ల రసాలు
పండ్ల రసాల్లో పీచు ఉండదు. దీంతో వీటిని తాగడం వల్ల వెంటనే బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. మధుమేహం ఉన్న వారు పండ్ల రసానికి బదులు నేరుగా పండు తినొచ్చు.  నిమ్మరసం, కుకుంబర్ రసాన్ని తీసుకోవచ్చు.

పప్పులు
అల్పాహారంలో భాగంగా తీసుకునే పలు రకాల పప్పులతోనూ రిస్క్ ఉంటుంది. ఈ పప్పులు, ధాన్యాలన్నీ కూడా పాలిష్ పట్టినవి. సరిపడా లేని పీచు, అధిక చక్కెర ఉన్నవి చెడ్డ ఎంపికలు.

ప్యాన్ కేక్స్
ప్యాన్ కేక్ లు, వాఫిల్స్ కూడా ఇంతే. బ్రేక్ ఫాస్ట్ చేసుకునేంత సమయం లేదని వీటిని ఆశ్రయించే వారు ఎందరో. కానీ, ఉదయం పూట వీటిని తినడం ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ.

టీ
కాఫీ మాదిరే ఉదయం ఖాళీ కడుపుతో టీ సేవించడం మంచిది కాదు. కెఫైన్, అధిక చక్కెర పరిమాణం, నికోటిన్ తో కడుపులో మంట, రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతాయి.


More Telugu News