ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటో తోలిన యువకుడు..!
- దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన
- ట్రాఫిక్ జాం నుంచి తప్పించుకునేందుకు ఆటోవాలా ప్రమాదకర చర్య
- సోషల్ మీడియాలో వీడియో వైరల్, వెల్లువెత్తిన విమర్శలు
- నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తి అరెస్ట్, ఆటో సీజ్
వీధుల్లో కొందరు ఆటోవాలాలు చేసే సర్కస్ ఫీట్లు కొన్నిసార్లు భయాందోళనలు కలిగిస్తాయి. వేగంగా నడపడం, ప్రమాదకరంగా ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయడం వంటి ఎన్నో ఘటనలు గతంలో చూశాం. అయితే, ఢిల్లీలో ఓ ఆటోవాలా గతంలో ఎవరూ చేయని ప్రమాదకరమైన పనిని చేశాడు.
ట్రాఫిక్ సమస్య తప్పించుకునేందుకు అతడు ఏకంగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటోను తోలాడు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేరు. మరో వ్యక్తి సాయంతో అతడు ఆటోను మెట్లపై ఎక్కించాడు. ఆ తరవాత ఆటోవాలా స్నేహితుడు కూడా అందులోకి ఎక్కేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను మున్నాగా పోలీసులు గుర్తించారు. అతడి ఆటోను సీజ్ చేయడంతో పాటూ నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.