నేను వస్తుంటే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు: నారా లోకేశ్
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేశ్ యువగళం
- నిడమర్రు మండలంలో ఫ్లెక్సీల వివాదం
- తమ నాయకుడ్ని అవమానించేలా ఫ్లెక్సీలు పెడితే చింపేస్తామన్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే నిడమర్రు మండలం మందలపర్రులో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీనిపై నారా లోకేశ్ స్పందించారు.
తన పాదయాత్రను ఒక్కరోజైనా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పాదయాత్ర దారిలో రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడిని అవమానించేలా ఫ్లెక్సీలు పెడితే మాత్రం చింపేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. మీరు చేసిన అక్రమాలపై ఫ్లెక్సీలు పెట్టమంటారా... జగన్? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తెచ్చిన కొత్త పథకం 'అంధకార ప్రదేశ్' అని ఎద్దేవా చేశారు. జగన్ ది 24 గంటల విద్యుత్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని పేర్కొన్నారు. పోలవరం కుడి కాలువ మట్టి తవ్వి అమ్మేస్తున్నారని మండిపడ్డారు.