జీ-20 సదస్సుకు వచ్చే విదేశీ అతిథుల కోసం నోరూరించే వంటకాలు
- సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సదస్సు
- భారత్ రానున్న వివిధ దేశాధినేతలు
- ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో బస
- 250 రకాల దేశీయ, విదేశీ వంటకాలతో మెనూ
ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ-20 సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు విదేశీ అతిథులు పెద్ద సంఖ్యలో రానున్నారు. వివిధ దేశాధినేతలు వస్తుండడంతో వారి కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేయనున్నారు. ప్రపంచ దేశాధినేతలకు, వారితో పాటు వచ్చే అధికారులు, ప్రతినిధుల బృందాలకు పేరుమోసిన హోటళ్లలో బస ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఆయా హోటళ్లలో రుచికరమైన, భారతీయ విశిష్టతను చాటే వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా, తృణ ధాన్యాలతో తయారైన వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డించనున్నారు.
జీ-20 సదస్సు అతిథులకు అందించే మెనూలో దేశంలోని పలు రాష్ట్రాల ఫేమస్ వంటకాలు, విదేశీ వంటకాలు సిద్ధం చేయనున్నారు. మొత్తం 250 రకాల స్వదేశీ, విదేశీ వంటకాలకు మెనూలో చోటు కల్పించారు. అతిథి మర్యాదలకు ఎలాంటి లోటు ఉండకూడదని కేంద్రం భావిస్తోంది.