తన అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేసిన రష్మిక... వీడియో ఇదిగో!

  • హైదరాబాదులో రష్మిక సహాయకుడి వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన రష్మిక
  • నూతన దంపతులు కాళ్లకు మొక్కడంతో కంగారుపడిన రష్మిక!
ఓవైపు అనేక భాషల చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన అసిస్టెంట్ పెళ్లికి హాజరై సందడి చేసింది. రష్మిక వ్యక్తిగత సహాయకుడి పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ పెళ్లికి ఎంచక్కా చీరలో విచ్చేసిన రష్మిక వధూవరులను ఆశీర్వదించింది. అక్షింతలు చల్లి వారికి శుభాకాంక్షలు తెలిపింది. 

కొత్త దంపతులు కాళ్లకు మొక్కడంతో కొద్దిగా కంగారుపడినట్టు కనిపించిన రష్మిక వారిని విపరీతంగా దీవించేసింది. రష్మిక రాకతో పెళ్లి మంటపం కళకళలాడింది. రష్మికతో ఫొటోలకు అక్కడివారు పోటీలు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


More Telugu News