ఒడిశా రైలు ప్రమాదంపై ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

  • ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్
  • రైల్వే చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నేరాభియోగాలు
  • ముగ్గురిని గతంలోనే అరెస్ట్ చేసిన సీబీఐ
ఒడిశా రైలు ప్రమాదంపై దర్యాఫ్తు చేపట్టిన సీబీఐ తాజాగా ముగ్గురు రైల్వే ఉద్యోగులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. రెండు నెలల క్రితం జూన్ 2న బాలేశ్వర్ జిల్లాలోని బాహానగా బజార్ స్టేషన్ వద్ద లూప్ లైన్ లో ఆగిన గూడ్స్ రైలును షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బోగీలను ఢీకొని బెంగళూరు -హౌరా సూపర్ ఫాస్ట్ రైలులోని బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో దాదాపు మూడు వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది గాయపడ్డారు.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. రైల్వే చట్టంలోని 153 సెక్షన్‌తో పాటు సాక్ష్యాలను నాశనం చేసే యత్నం, హత్యతో సమానమైన నేరాభియోగాలను మోపింది. రైలు ప్రమాదంలో కుట్రకోణం అనుమానాల నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో జులై 7న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్స్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజినీర్ అమీర్ ఖాన్, టెక్నిషియన్ పప్పు కుమార్‌లను అరెస్ట్ చేసింది.


More Telugu News