అక్క దీప్తిని చంపేసి, వోడ్కా తాగి చనిపోయినట్లుగా చందన క్రియేట్ చేసింది: ఎస్పీ
- చెల్లి చందన, ప్రియుడితో కలిసి దీప్తిని హత్య చేసినట్లు వెల్లడించిన పోలీసులు
- చందనకు కాలేజీలో పరిచయమైన ఉమర్‌తో పరిచయం ప్రేమగా మారిన వైనం
- ఇంకా సెటిల్ కాకపోవడంతో డబ్బులు కావాలని చందనను అడిగిన ఉమర్
- ఇంట్లో అక్క తప్ప ఎవరూ లేరని ఉమర్‌ను ఇంటికి పిలిపించిన చందన
- డబ్బు, బంగారం తీస్తుండటంతో కేకలు వేసిన దీప్తి
- ముఖానికి చున్నీ చుట్టి, మూతికి, ముక్కుకు ప్లాస్టర్ వేసి హత్య
కోరుట్ల సాఫ్టువేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి దీప్తి సోదరి చందన సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. చందనతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ షేక్ సుల్తాన్‌ను, అతని తల్లి సయ్యద్ అలియా, షేక్ ఆసియా ఫాతిమా, హఫీజ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుండి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దీప్తిని చంపేసిన తర్వాత వోడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారన్నారు. ఆర్మూర్ - బాల్కొండ రోడ్డులో నిందితులు కారులో వెళ్తున్నారనే సమాచారంతో కోరుట్ల సీఐ ప్రవీణ్ సిబ్బందితో కలిసి నిందితుల్ని పట్టుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చందన 2019లో హైదరాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్‌లో జాయిన్ అయింది. రెండేళ్ళ తర్వాత డిటెయిన్ అయింది. అదే కాలేజీలో చదివిన ఉమర్ షేక్ సుల్తాన్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసింది. అగస్ట్ 19న వీరు కోరుట్లకు వచ్చి పెళ్లి విషయమై మాట్లాడారు. అయితే ఇద్దరం ఇంకా సెటిల్ కాలేదని, కాబట్టి డబ్బులు కావాలని ఉమర్ అడిగాడు. ఆ తర్వాత ఓ సమయంలో ఉమర్‌కు చందన ఫోన్ చేసి ఇంట్లో మా అక్క తప్ప ఎవరూ లేరని, కోరుట్లకు రావాలని చెప్పింది. దీంతో ఉమర్ అగస్ట్ 28న కోరుట్లకు వచ్చాడు.
ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం దీప్తి కోసం చందన వోడ్కా, బ్రీజర్ తెచ్చింది. సోమవారం రాత్రి తండ్రి శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకున్నారు. దీప్తి నిద్రపోయిన తర్వాత చందన... ఉమర్‌కు ఫోన్ చేసి, ఇంటికి రప్పించింది. ఇద్దరు కలిసి నగదు, బంగారం తీస్తుండగా... అది చూసిన దీప్తి కేకలు వేసింది. దీంతో దీప్తి అరవకుండా మెడకు చున్నీ చుట్టి వెనక్కి లాగారు. అయినా అరవడంతో ఇద్దరూ కలిసి దీప్తి ముఖానికి చున్నీని చుట్టి, మూతికి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు. కొద్ది నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేకపోయేసరికి ఆమెను అక్కడే వదిలేసి 70 తులాల బంగారం, రూ.1.20 లక్షల నగదును తీసుకొని వెళ్లిపోయారు.
అయితే వెళ్లిపోయేముందు దీప్తిది సహజమరణంగా చిత్రించే ప్రయత్నం చేశారు. వోడ్కా తాగి చనిపోయినట్లుగా సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుండి సేఫ్ జోన్‌లోకి వెళ్లాలని భావించారు. నాగ్‌పూర్ వెళ్లి స్థిరపడాలని భావించారు. ఈ క్రమంలో ఆర్మూర్ రోడ్డులో శనివారం ఉదయం నిందితులను అరెస్ట్ చేశారు.