ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా దూకుడు... భారీ స్కోరు దిశగా భారత్
- ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాక్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 40 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు
- ఓ దశలో 66 పరుగులకే 4 వికెట్లు డౌన్
- అర్ధసెంచరీలతో ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా
ఆసియా కప్ లో పాకిస్థాన్ తో పోరులో టీమిండియా బ్యాటర్లు నిదానంగా పుంజుకున్నారు. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓ దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్ ను ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా ఆదుకున్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ, ఆ తర్వాత గేర్లు మార్చి భారీ షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. కిషన్, పాండ్యా ఐదో వికెట్ కు 138 పరుగులు జోడించడం విశేషం. ఈ జోడీని హరీస్ రవూఫ్ విడదీశాడు. ఇషాన్ కిషన్ 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 40 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు. హార్దిక్ పాండ్యా 80 పరుగులతోనూ, జడేజా 1 పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో రవూఫ్ 3, అఫ్రిది 2 వికెట్లు తీశారు.