కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో, ఎండీ పదవికి ఉదయ్ కోటక్ రాజీనామా

  • నాలుగు నెలల ముందే రాజీనామా చేసిన ఉదయ్  
  • నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కొనసాగనున్న ఉదయ్  
  • తాత్కాలిక ఎండీగా దీపక్ గుప్తా
కోటక్ మహీంద్రా ఎండీ, సీఈవో ఉదయ్ కోటక్ తన పదవులకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తక్షణమే అమలులోకి వచ్చినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజీకి సమాచారం ఇచ్చింది. ఆయన పదవీకాలం డిసెంబర్ 31, 2023 వరకు ఉంది. కానీ నాలుగు నెలల ముందే ఆయన రాజీనామా చేశారు. తాత్కాలిక ఎండీగా ప్రస్తుత జాయింట్ ఎండీ దీపక్ గుప్తా వ్యవహరించనున్నారు.

పదవీ విరమణకు మరింత గడువు ఉన్నప్పటికీ ఇదే సరైన సమయమని భావించి ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది చివరికల్లా తనతో పాటు చైర్మన్, జాయింట్ ఎండీ రాజీనామా చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో అధికార మార్పిడి సులువయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

1985లో ఎన్బీఎఫ్‌సీని ప్రారంభించిన ఉదయ్ కోటక్ 2003 నాటికి దానిని పూర్తిస్థాయి కమర్షియల్ బ్యాంకుగా మార్చారు. మార్కెట్ క్యాప్ పరంగా కోటక్ మహీంద్రా మూడో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు. సీఈవోగా వైదొలిగినప్పటికీ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. ఏదైనా బ్యాంకు సీఈవోగా పదిహేనేళ్లకు మించి ఉండకూడదని ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి.


More Telugu News