అఫ్రిది ధాటికి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ, కోహ్లీ
- ఆసియా కప్ లో నేడు భారత్, పాక్ సమరం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 27 పరుగులకే 2 వికెట్లు డౌన్
- నిప్పులు చెరిగే బౌలింగ్ తో కీలక వికెట్లు తీసిన షహీన్ అఫ్రిది
ఆసియా కప్ లో భాగంగా టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ కు వరుణుడు కొద్దిపాటి ఆటంకం కలిగించగా, మ్యాచ్ మళ్లీ మొదలైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... పాక్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది ధాటికి విలవిల్లాడింది.
తొలుత కెప్టెన్ రోహిత్ శర్మను ఇన్ స్వింగ్ డెలివరీతో బోల్తా కొట్టించిన ఈ లెఫ్టార్మ్ సీమర్... ఆ తర్వాత కాసేపటికే కోహ్లీని ఇన్ సైడ్ ఎడ్జ్ తో తిప్పిపంపాడు. 12 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్ 7 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 30 పరుగులు చేసింది.
ప్రస్తుతం ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (1 బ్యాటింగ్), శ్రేయాస్ అయ్యర్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.