ఢిల్లీ వయా బెంగళూరు అంటూ కవిత చురకలు.. ఇదే కేసీఆర్ మ్యాజిక్ అంటూ రేవంత్ కౌంటర్
- ఎక్స్ సోషల్ మీడియా వేదికగా కవిత వర్సెస్ రేవంత్ రెడ్డి
- శివకుమార్‌తో రేవంత్ భేటీపై కవిత విమర్శలు
- మోదీకి కేసీఆర్ వంగి నమస్కరించిన ఫోటోతో రేవంత్ ట్వీట్
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం సాగింది. రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లడంపై కవిత ట్విట్టర్ వేదికగా చురకలు వేస్తే, రేవంత్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోతో కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ బెంగళూరుకు వెళ్లి, తమ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కవిత ట్వీట్ చేస్తూ అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు ఢిల్లీ... కానీ ఇప్పుడు వయా బెంగళూరు... కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం... ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం... అంటూ కవిత ట్వీట్ చేశారు. డీకే శివకుమార్‌తో టీపీసీసీ చీఫ్ భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు.
కవిత ట్వీట్‌పై రేవంత్ రెడ్డి దీటుగా స్పందించారు. గల్లీలో సవాళ్లు... ఢిల్లీలో వంగి వంగి మోకరిల్లి వేడుకోల్లు... ఇది కేసీఆర్ మ్యాజిక్కు.. జగమెరిగిన నిక్కర్...లిక్కర్... లాజిక్కు అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట సీఎం కేసీఆర్ తలవంచి నమస్కరిస్తున్న ఫోటోను షేర్ చేశారు.