కాకినాడలో టీడీపీ జోన్-2 సమావేశం... హాజరైన చంద్రబాబు
- ఎన్నికల దిశగా టీడీపీని సమాయత్తం చేస్తున్న చంద్రబాబు
- నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య ఐక్యతకు చంద్రబాబు కృషి
- బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టింది. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలను తొలగించడానికి పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. నేతలు కలసికట్టుగా ఉంటేనే వైసీపీని ఎదుర్కోగలమని ఆయన భావిస్తున్నారు.
ఈ క్రమంలో, కాకినాడలో నేడు టీడీపీ జోన్-2 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ 45 రోజుల కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎంత బలంగా తీసుకెళితే అంతగా ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. నేతల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.