గత నాలుగేళ్లలో శ్రీవాణి ట్రస్టుకు భారీగా విరాళాలు

  • 2019 నుంచి భక్తులకు అందుబాటులో తిరుమల శ్రీవాణి ట్రస్టు 
  • ఇప్పటివరకు రూ.823 కోట్ల విరాళాలు
  • ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణకు నిధుల వినియోగం
తిరుమల శ్రీవాణి ట్రస్టు (శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు)కు విరాళాలు ఇవ్వాలంటూ టీటీడీ ఇచ్చిన పిలుపునకు శ్రీవారి భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. గత నాలుగేళ్లలో శ్రీవాణి ట్రస్టుకు భారీగా విరాళాలు లభించాయి. 

2019లో శ్రీవాణి ట్రస్టును భక్తులకు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పటివరకు రూ.823.45 కోట్లు విరాళాల రూపంలో అందాయి. తొలి ఏడాది రూ.26.25 కోట్లు లభించగా, 2023లో ఇప్పటిదాకా రూ.268.35 కోట్ల విరాళాలు లభించడం విశేషం. 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్టుకు లభించిన విరాళాలను ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాల ఖర్చులకు వినియోగిస్తోంది. అంతేకాదు, సనాతన ధర్మ ప్రచారం, మతమార్పిళ్లను అరికట్టడం కూడా ఈ ట్రస్టు విధుల్లో ముఖ్యమైన అంశాలు. శ్రీవాణి ట్రస్టు ద్వారా దళితులకు, బీసీలకు అర్చక శిక్షణ అందించే ప్రణాళిక ఉంది.


More Telugu News