చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెరటం

  • 1986 నుంచి భారత నం.1గా ఉన్న ఆనంద్
  • దిగ్గజాన్ని వెనక్కునెట్టిన డి. గుకేశ్
  • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానం సొంతం
చదరంగంలో ఇప్పుడు భారత్ దూసుకెళ్తోంది. దేశం నుంచి ఇప్పటికే 80 మంది పైచిలుకు గ్రాండ్ మాస్టర్లు ఉండగా.. రెండేళ్లలో ఆ సంఖ్య వందకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య భారత యువ గ్రాండ్ మాస్టర్లు ప్రపంచ వేదికలపై అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. చెన్నైకి చెందిన 18 ఏళ్ల ఆర్. ప్రజ్ఞానంద గత వారం ఫిడే చెస్ ప్రపంచ కప్‌ లో రజతంతో చరిత్ర సృష్టించాడు. తాజాగా చెన్నైకే చెందిన మరో యువ కెరటం, 17 ఏళ్ల డి. గుకేశ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత చదరంగంలో  37 ఏళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ ను వెనక్కు నెట్టాడు. 

ప్రపంచ చెస్ సమాఖ్య –ఫిడే నిన్న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గుకేశ్‌ 2758 రేటింగ్‌ పాయింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్ సాధించాడు. ఆనంద్‌ 2754 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. దాంతో, భారత్ తరఫున టాప్ ప్లేస్ గుకేశ్‌ సొంతమైంది. ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆనంద్ 1986 జులై1వ తేదీ నుంచి భారత నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మూడున్నర దశబ్దాలుగా చెక్కుచెదరని ఈ రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు.


More Telugu News