రెండు రోజుల ముందే ఇండియాకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్

  • సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఇండియాలో జీ20 సమ్మిట్
  • 8న ప్రధాని మోదీతో భేటీ కానున్న బైడెన్
  • ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న ఇరువురు దేశాధినేతలు
ఇండియాలో జరగనున్న జీ20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రానున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు సమావేశాలకు రెండు రోజుల ముందే భారత్ కు బైడెన్ రానున్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో బైడెన్ ప్రత్యేకంగా భేటీ అవుతారని, ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. గురువారం నాడు ఢిల్లీకి బైడెన్ బయల్దేరుతారని వెల్లడించింది. సెప్టెంబర్ 8న మోదీతో భేటీ అవుతారని తెలిపింది. 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్ లో పాల్గొంటారని... ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ ఛేంజ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పేదరికంపై పోరాటం వంటి అంశాలపై ప్రపంచ నేతలతో చర్చిస్తారని వెల్లడించింది.



More Telugu News