టీమిండియా - పాకిస్థాన్ మధ్య నేడే హైఓల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులో వీరు ఉండే అవకాశం!

  • ఆసియాకప్ లో ఇండియా - పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్
  • శ్రీలంకలోని పల్లెకెలేలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం
  • శ్రేయస్ అయ్యర్, బుమ్రాలకు చోటు లభించే అవకాశం
ఆసియా కప్ టోర్నీలో ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని పల్లెకెలేలో దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు పోటీ పడుతుండటం ఇదే తొలిసారి. టీమిండియా జట్టుకు రోహిత్ శర్మ, పాక్ జట్టుకు బాబర్ ఆజమ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టులో ఈ ఆటగాళ్లు ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు తుది జట్టులో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  



More Telugu News