డబ్బున్న వాళ్లందరూ చెడ్డోళ్లని నా కుతురు అనుకుంటుంది: ఎలాన్ మస్క్

  • ఈ నెల 12న మస్క్ జీవిత చరిత్రపై పుస్తకం విడుదల
  • పుస్తకంలోని కొన్ని ఆసక్తికర విషయాలు వాల్ స్ట్రీట్ జర్నల్‌ పత్రికలో తాజాగా ప్రచురణ
  • ట్రాన్స్‌జెండర్‌ కూతురితో మస్క్ విభేదాలపై పుస్తకంలో ప్రస్తావన
  • తన కూతురు సోషలిస్ట్ భావజాలం నుంచి పూర్తిగా కమ్యూనిజంవైపు మళ్లిందన్న మస్క్
  • కడుపున పుట్టిన బిడ్డతో విభేదాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని వ్యాఖ్య
టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ జీవితంపై ఈ నెల 12న ఓ పుస్తకం విడుదల కానుంది. ఇందులో మస్క్ తన జీవితానికి సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించారు. ఈ జీవిత చరిత్రలోని కొన్ని కీలక వివరాలు తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో ప్రచురితమయ్యాయి. తన ట్రాన్స్‌జెండర్ కూతురు వీవియన్ జెన్నా విల్సన్‌తో ఉన్న విభేదాల గురించి కూడా ఈ పుస్తకంలో మస్క్ ప్రస్తావించారు. 

‘‘ఆమె సోషలిజం నుంచి పూర్తిగా కమ్యూనిజం వైపు మళ్లింది. డబ్బున్న ప్రతి ఒక్కరూ చెడ్డవారని భావించే స్థితికి వచ్చేసింది. కన్నబిడ్డతో సఖ్యత కోసం ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆమె దూరం కావడం నన్ను చాలా బాధించింది. నా తొలి సంతానం మరణం తరువాత ఇంతగా వేదన మిగిల్చించి మరొకటి లేదు’’ అని మస్క్ చెప్పినట్టు పుస్తక రచయిత వాల్టర్ ఐసాక్సన్ పేర్కొన్నారు. 

పుట్టుకతో పురుషుడైన వీవియన్ ఆ తరువాత స్త్రీగా మారింది. అంతేకాకుండా, తండ్రితో ఎటువంటి సంబంధం ఉండకూదనే ఉద్దేశంతో గతేడాది తన పేరును జేవియర్ అలెగ్జాండర్ మస్క్ నుంచి వీవియన్‌గా మార్చుకుంది. అయితే, తన కూతురు ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి కారణం ఆమె చదువుకున్న స్కూలేనని మస్క్ గతంలో ఆరోపించారు.


More Telugu News