ఆదిత్య ఎల్-1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుంది: అమిత్ షా

  • చంద్రయాన్-3 విజయవంతం
  • అదే స్ఫూర్తితో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్-1
  • రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్
చంద్రయాన్-3 సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో సూర్యుడిపై పరిశోధనలకు ఉరకలు వేస్తోంది. రేపు (సెప్టెంబరు 2) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం నిర్వహించనున్నారు. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ ద్వారా ఈ సోలార్ మిషన్ ను రోదసిలోకి పంపించనున్నారు. 

దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇప్పటికే మనం చంద్రుడ్ని అందుకున్నాం, ఇకపై సూర్యుడ్ని కూడా చేరుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు. ఆదిత్య ఎల్-1 ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం వెలిబుచ్చారు. 

75 ఏళ్లలో అనేక విజయాలు సాధించామని, అయితే అంతటితో ఆగిపోకూడదని, నిరంతర కృషి ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు అందడం అనేది నాయకత్వానికి సవాలు వంటిదని అభిప్రాయపడ్డారు.


More Telugu News