టెక్కీ దీప్తి మృతి కేసు: చందన, ఆమె ప్రియుడు అరెస్ట్?
- జగిత్యాల జిల్లాలో సాఫ్టువేర్ ఇంజినీర్ దీప్తి అనుమానాస్పద మృతి
- అక్క మృతి చెందిన రోజునే ఇంటి నుండి వెళ్లిపోయిన చెల్లెలు చందన
- నాలుగు రోజులుగా చందన కోసం పోలీసుల గాలింపు
- ప్రకాశం జిల్లా ఒంగోలులో చందనతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు?
సాఫ్టువేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో ఆమె చెల్లెలు చందనను, ప్రియుడిని, వారికి సహకరించిన కారు డ్రైవర్, ఆశ్రయం కల్పించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బ ప్రాంతంలో దీప్తి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. అక్క మృతి చెందిన రోజునే చెల్లెలు చందన ఇంటి నుండి వెళ్లిపోయింది. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు... వారు నిజామాబాద్ బస్సు ఎక్కినట్లుగా గుర్తించారు. నాలుగు రోజులుగా ప్రత్యేక బృందాలు వారికోసం గాలిస్తున్నాయి.
అయితే శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద చందనను, ఆమె ప్రియుడితో పాటు కొందరిని అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. చందనతో పాటు ఉన్న యువకుడిని హైదరాబాద్‌వాసిగా గుర్తించారు. వీరిని కోరుట్లకు తీసుకు వచ్చి విచారిస్తున్నట్లుగా సమాచారం. అయితే పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. అక్క మృతి చెందిన రోజునే చందన ఇంటి నుండి ఎందుకు వెళ్లిపోయింది? ఇంట్లో మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయి? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది.