I.N.D.I.A. కూటమి భేటీకి ఆహ్వానంలేని అతిథి హాజరు.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..!
- ఆహ్వానం లేని కపిల్ సిబాల్ రాక
- ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ నాయకులు
- ఉద్ధవ్ థాకరే దృష్టికి తీసుకెళ్లిన కేసీ వేణుగోపాల్
- అభ్యంతరం లేదన్న రాహుల్ గాంధీ
ముంబైలో రెండు రోజులపాటు నిర్వహిస్తోన్న I.N.D.I.A. కూటమి సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ హాజరవడం కాంగ్రెస్ నాయకులను ఒకింత గందరగోళానికి గురి చేసింది. కపిల్ సిబాల్ దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఏడాది ఆ పార్టీని వీడి, సమాజ్‌వాది పార్టీ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో సిబాల్ రాక కాంగ్రెస్ నేతలను ఆశ్చర్యానికి గురిచేసినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కూటమి సమావేశానికి కపిల్ సిబాల్‌కు ఆహ్వానం లేదు.
ఆహ్వానంలేని కపిల్ సిబాల్ ఈ భేటీకి హాజరు కావడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే దృష్టికి తీసుకు వెళ్లారు. అయితే సిబాల్ రాకపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం అభ్యంతరం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా, సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు దూరంగా ఇతర కూటమి నేతలతో కలిసి కపిల్ సిబాల్ కనిపించడం గమనార్హం.