ఇంటికి పిలిపించుకొని చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద, అతని తల్లిదండ్రులకు ప్రధాని మోదీ ఆప్యాయ పలకరింపు
- చెస్ ప్రపంచ కప్ లో రజతం నెగ్గిన ప్రజ్ఞా
- అతడిని చూసి గర్విస్తున్నానని మోదీ ట్వీట్
- ప్రజ్ఞాకు రూ. 30 లక్షల నగదు బహుమతి అందించిన తమిళనాడు సీఎం
గతవారం చెస్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తమిళనాడు చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ప్రజ్ఞా, అతని తల్లిదండ్రులను ప్రధాని నిన్న ఆయన నివాసానికి పిలుపించుకున్నారు. చెస్ మేధావిని అభినందించిన ప్రధాని అతని తల్లిదండ్రులతో అప్యాయంగా మాట్లాడారు. వారితో ఫొటోలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన మోదీ తన ఇంటికి విశిష్ట అతిథులు వచ్చారని ట్వీట్ చేశారు. ‘ప్రజ్ఞానందను అతని కుటుంబంతో సహా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదల, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద. నిన్ను చూసి గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు.
.
మరోవైపు ప్రజ్ఞానందపై ప్రశంసలు, ప్రోత్సాహకాల వర్షం కురుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రోత్సాహక బహుమతి కింద రూ. 30 లక్షల నజరానా అందించారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా అతని తల్లిదండ్రులకు ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.