సీబీఐ కోర్టుకు వచ్చి, వెళ్లిన విజయసాయిరెడ్డి... ఎందుకంటే..!

  • విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు అనుమతి
  • గతంలో తన పాస్ పోర్టును కోర్టుకు అప్పగించిన విజయసాయి
  • కోర్టుకు వచ్చి పాస్ పోర్టును తీసుకెళ్లిన వైసీపీ ఎంపీ
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వచ్చారు. సీబీఐ కోర్టుకు గతంలో అప్పగించిన తన పాస్ పోర్టును తీసుకుని వెళ్లారు. నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లడానికి విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నిన్న అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన పాస్ పోర్టును తీసుకున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి తెలిపారు. అమెరికా, యూకే, దుబాయ్, జర్మనీ, సింగపూర్ దేశాల్లో పర్యటించేందుకు ఆయనకు కోర్టు అనుమతిని ఇచ్చింది. 

మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ ను కూడా విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. లండన్ లో ఉన్న తన కుమార్తెలను చూసేందుకు అక్కడకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని కోర్టును జగన్ కోరారు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు వెళ్లేందుకు జగన్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తన భార్యతో కలిసి జగన్ లండన్ కు వెళ్లనున్నారు. 



More Telugu News