స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో మరో మలుపు.. ఎమ్మెల్యే టికెట్ రేసులోకి సర్పంచ్ నవ్య!
- సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్
- మాజీ మంత్రి కడియం శ్రీహారికి టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ బాస్
- ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటున్న జానకిపురం సర్పంచ్ నవ్య
స్టేషన్ ఘనపూర్‌లో రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించారు. అయినా తాను పార్టీ మారనన్న రాజయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా మంద కృష్ణ మాదిగ తదితరులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు జానకిపురం సర్పంచ్ నవ్య టికెట్ రేసులోకి వచ్చారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు.
ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని, ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని నవ్య అంటున్నారు. ఈ రోజు హైదరాబాద్ వచ్చి పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నారు. టికెట్ కోసం విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. గతంలో ఎమ్యెల్యే రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన నవ్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇప్పుడు టికెట్ రేసులోకి వచ్చి కడియం శ్రీహరి, రాజయ్యతో పోటీపడటం స్టేషన్ ఘనపూర్ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.