కొత్త ఇంట్లో చేరిన వైవా హర్ష... ముఖ్య అతిథి ఎవరో చూడండి!

  • కెరీర్ లో మంచి దశలో ఉన్న వైవా హర్ష
  • ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన హర్ష
  • తాజాగా నూతన గృహ ప్రవేశం
యూట్యూబర్ గా, షార్ట్ ఫిలిం మేకర్/నటుడిగా, సినీ కమెడియన్ గా కొద్దికాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న వైవా హర్ష నూతన గృహ ప్రవేశం చేశాడు. ఇటీవల వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా మారాడు. మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న సుందరం మాస్టర్ అనే చిత్రంలో వైవా హర్షనే హీరో. హర్ష ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సొంతింట్లో అడుగుపెట్టాడు. 

వైవా హర్ష గృహ ప్రవేశ కార్యక్రమానికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ విచ్చేశాడు. హర్షకు, సాయిధరమ్ తేజ్ కు మధ్య చాలాకాలంగా స్నేహం ఉంది. తాజాగా గృహప్రవేశానికి హాజరైన సాయిధరమ్ తేజ్... వైవా హర్షకు, అతడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.


More Telugu News