తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
- కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న తుమ్మల
- ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మలకు దక్కని స్థానం
- వందలాది కార్లతో హైదరాబాద్ కు యాత్ర చేపట్టిన తుమ్మల
- నేడు తుమ్మలను కలిసిన రేవంత్ రెడ్డి, మల్లు రవి
ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు. దాంతో తన సత్తా నిరూపించుకునేందుకు ఆయన వందలాది కార్లతో హైదరాబాద్ కు ర్యాలీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో, నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మల్లు రవి కలిశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా తుమ్మలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తుమ్మల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే సెప్టెంబరు రెండో వారంలో రాహుల్ గాంధీ సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.