దేశంలో రైల్వే బోర్డు చీఫ్ గా తొలిసారి ఓ మహిళకు అవకాశం
- రైల్వే బోర్డు చైర్ పర్సన్, సీఈవోగా జయా వర్మ సిన్హా నియామకం
- ఇప్పటివరకు రైల్వే బోర్డు మెంబర్ గా ఉన్న జయా వర్మ
- ప్రస్తుతం చీఫ్ గా వున్న అనిల్ కుమార్ లహోటీ
సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత రైల్వే బోర్డుకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించనున్నారు. రైల్వే బోర్డు నూతన చైర్ పర్సన్-సీఈవోగా జయా వర్మ సిన్హా నియమితులయ్యారు. ఇప్పటివరకు అనిల్ కుమార్ లహోటీ రైల్వే బోర్డు చైర్మన్ గా వ్యవహరించారు. రైల్వే బోర్డు చరిత్రలో ఓ మహిళ చైర్ పర్సన్ గా, సీఈవోగా నియమితురాలవడం ఇదే ప్రథమం.
జయా వర్మ రైల్వే ట్రాఫిక్ విభాగంలో అధికారిణి. ప్రస్తుతం ఆమె రైల్వే బోర్డులో కార్యకలాపాలు-వ్యాపార అభివృద్ధి విభాగం సభ్యురాలిగా ఉన్నారు.
ఆమెను రైల్వే బోర్డు నూతన చీఫ్ గా నియమిస్తున్నట్టు రైల్వే శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర నియామకాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపినట్టు వివరించింది. జయా వర్మ సిన్హా వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు ఈ పదవిలో కొనసాగనున్నట్టు తెలిపింది.