ఏపీలో మేము సర్వే చేయలేదు.. అది ఫేక్ న్యూస్: ఐప్యాక్ వివరణ

  • ఐప్యాక్ సర్వే అంటూ ఓ మీడియా సంస్థ ప్రచారం చేసిందని విమర్శ
  • తాము ఎన్నికల సర్వేలను చేయమని వెల్లడి
  • ఐప్యాక్ సర్వే అంటూ వచ్చే వార్తలు అవాస్తవమని స్పష్టీకరణ
ఏపీలో తాము చేసిన సర్వే అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ తెలిపింది. ఏపీలోని ఒక మీడియా చానల్ ఒక ఫేక్ సర్వేను తమదంటూ ప్రచారం చేసిందని విమర్శించింది. తాము ఎన్నికల సర్వేలను నిర్వహించమనే విషయం తమ రికార్డును చూస్తే అర్థమవుతుందని చెప్పింది. ఐప్యాక్ సర్వే అంటూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తలన్నీ అవాస్తవాలేనని తెలిపింది. కొందరు వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ చేస్తున్న పని ఇదని వ్యాఖ్యానించింది.


More Telugu News