అమెరికాలో రోబో ట్యాక్సీలలో అనైతిక కార్యకలాపాలు

  • ప్రయాణంలో శృంగారానికి పాల్పడుతున్న జంటలు
  • భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు.. అయినా తగ్గని యువత
  • రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించట్లేదని సమర్థింపు
అమెరికాలో ప్రయాణికుల సౌకర్యం కోసం తీసుకొచ్చిన రోబో ట్యాక్సీలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. రాత్రిపూట మాత్రమే నడవడం, డ్రైవర్ లేకపోవడంతో వాటిలో శృంగారం చేస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకుని ప్రయాణం మొదలయ్యాక వెనక సీట్లో ప్రేమకలాపాల్లో తేలిపోతున్నారు. ఇది గమనించిన రోబో ట్యాక్సీ కంపెనీ.. భద్రత కోసం డ్రైవర్ లెస్ కార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అసభ్య కార్యకలాపాలు చేయొద్దని ప్రయాణికులను హెచ్చరించింది. అయినా సరే యువత వెనక్కి తగ్గడంలేదు. రోబో ట్యాక్సీ రూల్స్ కు విరుద్ధంగా తాము ఏమీ చేయడంలేదని వాదిస్తున్నారు. ట్యాక్సీ కంపెనీ రూల్స్ లలో ట్యాక్సీని నీట్ గా ఉంచాలని మాత్రమే ఉందని, ట్యాక్సీలో శృంగారం చేయొద్దని ఎక్కడా లేదని అంటున్నారు.

కాలిఫోర్నియాలో రోబో ట్యాక్సీలకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, వీటిని కేవలం రాత్రిపూట మాత్రమే తిప్పాలని ఆయా కంపెనీలకు కండిషన్ పెట్టింది. రాత్రిపూట విధులు ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వెళ్లే వారికి ఈ రోబో ట్యాక్సీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించింది. ఈ కార్లు తమకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని నైట్ డ్యూటీలు చేసే ఉద్యోగులు, రాత్రిపూట ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు కంఫర్ట్ గా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే, కొంతమంది మాత్రం వీటిని అనైతిక కార్యకలాపాల కోసం వాడుకుంటున్నారు. కారులోని వెనక సీటులో శృంగారంలో మునిగిపోతున్నారు. వెనక సీటు విశాలంగా ఉండడంతో మంచి కంఫర్ట్ గా ఫీలవుతున్నామని కంపెనీకి థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. దీంతో ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి రోబో ట్యాక్సీ కంపెనీ కొత్త రూల్స్ పెట్టాలని నిర్ణయించింది.


More Telugu News