భార్యను హింసిస్తున్నాడని.. బావమరిదిని చంపి ముక్కలుగా కోసి వంటగదిలో దాచిపెట్టిన బావ
- ముంబైలో ఘటన
- చెల్లెలితోనే అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో తట్టుకోలేకపోయిన బావ
- హెచ్చరించినా మారని వైనం
- నేరాన్ని అంగీకరించిన నిందితుడు
17 ఏళ్ల బావమరిదిని చంపిన ఓ వ్యక్తి అతడి శరీరాన్ని 5 ముక్కలుగా కోసి కిచెన్‌లో దాచిపెట్టాడు. ముంబైలో జరిగిందీ ఘటన. ఈ కేసులో అరెస్ట్ అయిన 33 ఏళ్ల నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు షఫిక్ షేక్ భార్య తండ్రి వద్ద పెరిగిన ఈశ్వర్ పుత్రన్... షేక్ భార్యను హింసిస్తుండడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో సోమవారం మరోమారు గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన షేక్.. ఈశ్వర్‌ను హత్యచేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా కోసి, వంటగదిలో దాచిపెట్టాడు. బాధితుడు కనిపించకపోవడంతో అతడి పెంపుడు తండ్రి లలిత్ పుత్రన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
చెంబూరులో గుర్రపు షెడ్డు నడుపుతున్న లలిత్, అతడి భార్య రేష్మకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం తల్లిని కోల్పోయి, తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడంతో ఒంటరిగా సంచరిస్తున్న బాలుడిని వీరు దత్తత తీసుకున్నారు. ఈశ్వర్ మార్వాడి అన్న అతడి పేరును ఈశ్వర్ పుత్రన్‌గా మార్చారు. నాలుగేళ్ల క్రితం లలిత్ తన కుమార్తెల్లో ఒకరైన అమైరాను షేక్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ తర్వాతి నుంచి షేక్‌కు, ఈశ్వర్‌కు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. షేక్, అమైరా దంపతులకు ఓ చిన్నారి కూడా ఉంది. ఏడాది క్రితం తన భార్య అమైరాతో ఈశ్వర్ అసభ్యంగా ప్రవర్తించడం చూసినట్టు నిందితుడు తెలిపాడు. అప్పుడే అతడికి వార్నింగ్ ఇచ్చానని, అయినా తీరు మారకపోవడంతో చంపేశానని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.