భర్తపై కేసు తిరగదోడినా భయపడేది లేదంటున్న ఎమ్మెల్యే రేఖా నాయక్​

  • ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు టికెట్ ఇవ్వని బీఆర్ఎస్
  • కాంగ్రెస్‌ లో చేరి బీఆర్‌‌ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటానన్న రేఖ
  • ఆసిఫాబాద్ లో పోటీకి సిద్ధమవుతున్న ఆమె భర్త
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. ఆమె పార్టీ మారుతానని ప్రకటించడంతో మహబూబా బాద్ ఎస్పీ గా పని చేస్తున్న రేఖా నాయక్ అల్లుడు శరత్ చంద్ర పవార్ ను ఉన్నట్టుండి ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. దాంతో గతంలో రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ పై నమోదైన ఏసీబీ కేసును తిరగదోడే ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తద్వారా రేఖా నాయక్ కు చెక్ పెట్టడం తో పాటు ఆసిఫాబాద్ లో ఆమె భర్త పోటీ చేయకుండా ఉండేందుకు ఎత్తుగడ వేస్తోందని తెలుస్తోంది.

ఈ క్రమంలో రేఖా నాయక్ బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేస్తానని, బీఆర్ఎస్ పై పగ తీర్చుకుంటానని ప్రకటించారు. రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, తన భర్త ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని రేఖ స్పష్టం చేశారు. శ్యామ్ నాయక్ సైతం తాను వెహికిల్ ఇన్ స్పెక్టర్ గా వీఆర్ఎస్ తీసుకునేటప్పుడు ఏసీబీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు.


More Telugu News