అమెరికాకు వెళుతున్న బండి సంజయ్

  • రేపు తెల్లవారుజామున యూఎస్ కు పయనమవుతున్న బండి సంజయ్
  • 10 రోజుల పాటు అమెరికా పర్యటన
  • పలు ఎన్నారై సంఘాలతో భేటీ కానున్న బీజేపీ నేత
తెలంగాణ బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. రేపు ఉదయం తెల్లవారుజామున ఆయన యూఎస్ కు పయనమవుతున్నారు. 10 రోజుల పాటు ఆయన అమెరికాలో ఉండనున్నారు. సెప్టెంబర్ 2న అట్లాంటాలో జరిగే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా) 15వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు. న్యూజెర్సీ, డల్లాస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లో ఆయన పర్యటించబోతున్నారు. పలు తెలుగు ఎన్నారై సంఘాలతో భేటీ అవుతారు. ఈ సమావేశాల్లో రాజకీయ, సినీ, సాహిత్య, వైద్య, వ్యాపార, సేవా, నాటక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. అమెరికా పర్యటనను ముగించుకుని సెప్టెంబర్ 10న ఆయన స్వదేశానికి తిరిగి రానున్నారు.


More Telugu News