ఇజ్రాయెల్ ఆటగాడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన వెయిట్‌లిఫ్టర్.. జీవితకాల నిషేధం విధించిన ఇరాన్

  • పోలండ్‌లోని వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో ఘటన
  • సహచర అథ్లెట్ మాక్సిమ్‌తో చేతులు కలిపిన మోస్తాఫా రాజేయి
  • ఏ క్రీడలోనూ పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించిన ఇరాన్
ఇజ్రాయెల్ వెయిట్‌లిఫ్టర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాడన్న ఒకే ఒక్క కారణంతో ఇరాన్ వెయిట్‌లిఫ్టర్‌పై ఆ దేశం జీవితకాల నిషేధం విధించింది. పోలండ్‌లోని వీలిక్జాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ చాంపియన్‌షిప్‌లో శనివారం ఇరాన్‌కు చెందిన మోస్తాఫా రాజేయి (40).. సహచర ఇజ్రాయెల్ వెయిట్‌లిఫ్టర్ అయిన మాక్సిమ్ స్విర్‌స్కీతో చేతులు కలిపాడు. శత్రుదేశ ఆటగాడితో చేతులు కలిపాడన్న కారణంతో తమ దేశ ఆటగాడిపై ఇరాన్ ప్రభుత్వం అతడిపై జీవితకాల నిషేధం విధించింది.

మోస్తఫా రాజేయిని దేశంలోని ఏ క్రీడలోనూ ఆడకుండా జీవితకాల నిషేధం విధించినట్టు వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ పేర్కొంది. అలాగే, పోటీకి సంబంధించిన ప్రతినిధి బృందం హెడ్ హమీద్ సలేహినియాను కూడా తొలగించింది. ఇజ్రాయెల్‌ను బద్ధ శత్రువుగా పరిగణించే ఇరాన్ ఆ దేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది.


More Telugu News