'సూపర్ బ్లూమూన్'గా చంద్రుడి అరుదైన దృశ్యం
- ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూమూన్
- ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30, 31 తేదీల్లో బ్లూమూన్‌గా చంద్రుడు
- భారత్‌లో రేపు ఉదయం 7 గంటలకు గరిష్ఠస్థాయికి బ్లూమూన్
ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూమూన్ పరిణామం చోటు చేసుకుంది. అగస్ట్‌లో రెండు పౌర్ణమిలు రావడంతో రెండో పౌర్ణమి రోజు పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూమూన్ అంటారు. ఆగస్టు 1న తొలి పౌర్ణమి వచ్చింది. ఈ రోజు బుధవారం రెండో పౌర్ణమి. ఈ రోజు పెద్దగా కనిపించే చంద్రుడే బ్లూ మూన్. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సమయాలకు అనుగుణంగా ఆగస్టు 30 లేదా 31 తేదీలలో చంద్రుడు బ్లూమూన్‌గా కనిపిస్తాడు. భారత్‌లో ఆగస్టు 30 రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సూపర్ మూన్ ఆవిష్కృతమైంది. అయితే సూపర్ బ్లూమూన్ మాత్రం ఆగస్టు 31న ఉదయం ఏడు గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుతుంది.
పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్‌గా చెబుతారు. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ పరిమాణం కంటే ఏడు శాతం పెద్దగా, పదహారు శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అయితే బ్లూమూన్ అన్నంత మాత్రాన మరీ నీలిరంగులో కనిపించదు. గతంలో 1940లో, ఆ తర్వాత 2018లో బ్లూమూన్ కనిపించింది. ఇప్పుడు మరలా కనిపించిన ఈ సూపర్ బ్లూమూన్ మళ్లీ 2037లో కనిపించనుంది.