పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే కోహ్లీ చాలా ప్రమాదకరంగా ఉంటాడు: మహమ్మద్ కైఫ్
- గత ఏడాది ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడని గుర్తు చేసిన కైఫ్
- కోహ్లీ ధాటిగా ఆడి టీమిండియాను గెలిపించిన క్షణాలు పాక్ బౌలర్ల మదిలో మెదులుతుంటాయని వ్యాఖ్య
- కోహ్లీకి పాక్ బౌలర్ల బలాలు, బలహీనతలు తెలుసునని వెల్లడి
పాకిస్థాన్‌తో ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడని మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ అన్నారు. గత ఏడాది జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై కోహ్లీ అద్భుతంగా ఆడాడని గుర్తు చేశారు. కోహ్లీకి బౌలింగ్ చేస్తున్నప్పుడు పాకిస్థాన్ బౌలర్లు ఒత్తిడికి గురవుతారన్నారు. 2022 ట్వంటీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ధాటిగా ఆడి టీమిండియాను గెలిపించిన క్షణాలు పాక్ బౌలర్ల మదిలో మెదులుతుంటాయన్నాడు. పాక్‌తో మ్యాచ్ అంటే కోహ్లీ చాలా ప్రమాదకరంగా ఉంటాడని చెప్పాడు.
గత ఏడాది ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై కోహ్లీ అద్భుత ఆటతీరు కనబరిచారన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే చెలరేగిపోతాడని, పూర్తి బాధ్యత తీసుకొని ఆడుతాడన్నాడు. కోహ్లీతో ప్రమాదం పొంచి ఉంటుందని, అతడిని ఔట్ చేస్తేనే తమకు సులువు అవుతుందని పాక్ బౌలర్లకు తెలుసునని చెప్పారు. కోహ్లీ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని, కాబట్టి పాక్ బౌలర్లపై ఒత్తిడి ఉంటుందన్నాడు. వారి బలాలు, బలహీనతలు కోహ్లీకి బాగా తెలుసునన్నాడు.