పాకిస్థాన్ జట్టు బలంగా ఉందన్న రవిచంద్రన్ అశ్విన్
- బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లు నిలదొక్కుకుంటే ప్రమాదకరంగా మారతారని వెల్లడి
- టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్ ఫేవరేట్ అని వ్యాఖ్య
- చివరి మూడు వన్డేలలో పాక్‌పై భారత్ విజయం
పాకిస్థాన్ బలమైన జట్టు అని, కాంటినెంటల్ ఈవెంట్‌లో వారిని ఓడించడం కాస్త కష్టమేనని భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు నిలదొక్కుకుంటే ప్రమాదకరంగా మారుతారన్నాడు. ఈ టోర్నమెంట్‌లో (ఆసియా కప్) భారత్, పాకిస్థాన్ రెండూ ఫేవరేట్ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించాడు. బాబర్, రిజ్వాన్ బ్యాట్‌తో నిలకడగా రాణిస్తే ఆసియా కప్, ప్రపంచ కప్ టోర్నీలోకి పాకిస్థాన్ వెళ్లడం ఖాయమన్నాడు.
టోర్నీలో భాగంగా శనివారం శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇంతకుముందు పాకిస్థాన్‌తో తలపడిన చివరి మూడు వన్డేలలో భారత్ విజయం సాధించింది. అయినప్పటికీ పాకిస్థాన్ బలంగా ఉందని అశ్విన్ చెప్పాడు. అయితే అదంతా పాక్ స్క్వాడ్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు.