తెలంగాణలో టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్

  • టీచర్ల బదిలీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు
  • ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సమర్థించిన న్యాయస్థానం
  • ఈ మేరకు గతంలో మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ తీర్పు
  • తుది తీర్పునకు లోబడి బదిలీలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. టీచర్ల బదిలీలకు హైకోర్టు తాజాగా అనుమతించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. 

టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లను తప్పు పట్టిన కోర్టు.. ఈ పాయింట్లు లేకుండానే బదిలీలను చేపట్టాలని కోరింది. అయితే, ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయింపును అనుమతించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నదే ఈ నిబంధన ఉద్దేశమని పేర్కొంది. దీంతో, ఉపాధ్యాయ దంపతుల కష్టాలకు చెక్ పడినట్టయింది. 


More Telugu News