చివరి గంటన్నరలో ఆవిరైన భారీ లాభాలు.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఒకానొక సమయంలో 65,459 పాయింట్లను తాకిన సెన్సెక్స్
- అమ్మకాల ఒత్తిడితో చివరకు 11 పాయింట్ల లాభంతో క్లోజ్ అయిన సెన్సెక్స్
- 5 పాయింట్ల స్వల్ప లాభంతో ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 11 పాయింట్లు లాభపడి 65,087కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 19,347 వద్ద స్థిరపడింది. వాస్తవానికి ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయిన వెంటనే అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 65,459 పాయింట్లను తాకింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇన్వెస్లర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరై, చివరకు మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
జియో ఫైనాన్స్ (4.99%), టాటా స్టీల్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.53%), మారుతి (1.50%), ఇన్ఫోసిస్ (1.19%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.31%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.97%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%).