హ్యాపీ జర్నీ కోసం విమానంలో ‘అడల్ట్స్ ఓన్లీ’ సెక్షన్

  • అందుబాటులోకి తీసుకొస్తున్న కొరెండాన్ ఎయిర్‌లైన్స్
  • ఒంటరి ప్రయాణికుల కోసం ‘పెద్దలకు మాత్రమే’ క్యాబిన్
  • 16 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అనుమతి
  • అదనపు రుసుము చెల్లించుకోవాల్సిందే
విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేసేటప్పుడు చిన్న పిల్లలు, తోటి ప్రయాణికుల నుంచి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణించేందుకు టర్కీకి చెందిన కొరెండాన్ ఎయిర్‌‌లైన్స్ ప్రత్యేక విభాగాన్ని ప్రకటించింది. దీనికి ‘అడల్డ్స్ ఓన్లీ’ (పెద్దలకు మాత్రమే) అని పేరు పెట్టింది. ప్రస్తుతానికి ఈ సౌకర్యాన్ని ఆమ్‌స్టర్‌డామ్-కురసావో మధ్య నడిచే విమానాల్లో నవంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. విమానం ముందు భాగంలో దీనిని ఏర్పాటు చేస్తారు.

16 ఏళ్లు దాటిన వారిని మాత్రమే ఇందులోకి అనుమతిస్తారు. ఈ విభాగంలో సీటుకోసం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు లేకుండా ఒంటరిగా ప్రయాణించే వారు ఇతర ప్రయాణికుల నుంచి ఇబ్బంది పడకుండా హాయిగా, ప్రశాంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కొరెండాన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. 

ఈ విభాగంలో నో కిడ్స్ జోన్‌లో సీటు కోసం అదనంగా 45 యూరోలు(49 డాలర్లు) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎక్స్‌ట్రా లాంగ్‌రూం సీట్స్ కోసం 100 యూరోలు (109 డాలర్లు) అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. కాగా, ఆమ్‌స్టర్‌డామ్-కురసావో మధ్య విమాన ప్రయాణం దాదాపు 10 గంటలు ఉంటుంది.


More Telugu News