దేశంలో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇవిగో!

  • ప్రస్తుతం శ్రావణమాసం
  • బంగారానికి పెరుగుతున్న గిరాకీ
  • రూ.250 మేర పెరిగిన 22 క్యారెట్ల బంగారం
  • 10 గ్రాముల ధర రూ.54,700కి చేరిన వైనం
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో, దేశంలో ఇవాళ బంగారం ధరలను పరిశీలిస్తే... కొద్దిమేర పెరుగుదల చోటుచేసుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగింది. పెరుగుదలతో కలుపుకుని 10 గ్రాముల బంగారం ధర రూ.54,700కి చేరుకుంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.59,670 పలుకుతోంది. ఇది ముంబయి ధర. 

హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.55,200... 24 క్యారెట్ల బంగారం రూ.60,220 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.54,850... 24 క్యారెట్ల బంగారం రూ.59,820... బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59,670... కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59.670... విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,700... 24 క్యారెట్ల బంగారం రూ.59,670 పలుకుతోంది. 

రూ. 200 మేర పెరిగిన వెండి

అదే సమయంలో వెండి ధర కూడా పెరిగింది. నిన్నటితో పోల్చితే కిలో వెండిపై రూ.200 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.77,100 పలుకుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.80 వేలుగా ఉంది.


More Telugu News