పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు.. లోకో పైలట్ గుర్తించడంతో తప్పిన పెను ప్రమాదం
- గుజరాత్‌లోని వడోదరలో ఘటన
- పట్టాలపై స్తంభాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిన ఒక రైలు
- స్తంభాలను గుర్తించి రైలును ఆపేసిన మరో రైలు లోకో పైలట్
గుజరాత్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు రైలును పట్టాలు తప్పించే కుట్ర చేశారు. పట్టాలపై అడ్డంగా ఇనుప స్తంభాలు వేశారు. వాటిని చూసి అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వడోదరలోని వర్ణ-ఇటోలా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది.
పట్టాలపై స్తంభాలను గుర్తించని ఓఖా-షాలీమార్ రైలు వాటిని ఢీకొట్టుకుంటూ వెళ్లినా ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే అదే రూట్లో వెళ్తున్న అహ్మదాబాద్-పూరీ రైలు లోకోపైలట్ పట్టాలపై స్తంభాలను గుర్తించి రైలును నిలపివేయడంతో ప్రమాదం తప్పింది. రైలును ఆపేసిన లోకోపైలట్ వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.