దాయాదుల పోరా మజాకా... గంటలోపే అమ్ముడైన భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లు
- అక్టోబరు 5 నుంచి భారత్ లో వన్డే వరల్డ్ కప్
- అక్టోబరు 14న దాయాదుల సమరం
- భారత్-పాక్ లీగ్ మ్యాచ్ కు ఆతిథ్యమివ్వనున్న నరేంద్ర మోదీ స్టేడియం
- సెప్టెంబరు 3న మరోసారి టికెట్లు అమ్మాలని బీసీసీఐ నిర్ణయం
దాయాదులు భారత్, పాకిస్థాన్ మధ్య ఏ క్రీడలో పోటీ జరిగినా అది అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. ఇక క్రికెట్ లో అయితే చెప్పేదేముంది... ఉత్కంఠకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంది. ఇక అసలు విషయానికొస్తే... అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాక్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్ జరగనుంది.
ఈ సూపర్ మ్యాచ్ కోసం నిన్న టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా, కేవలం గంటలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఒక్క టికెట్ కూడా మిగల్లేదంటే చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది.
నిర్వాహకులు ఒక్కో వ్యక్తికి రెండు టికెట్లు అమ్మారు. సెప్టెంబరు 3న మరోసారి టికెట్ల అమ్మకం ఉంటుందని బీసీసీఐ అధికారులు పేర్కొన్నారు.