తిరుమల క్షేత్ర సమాచారం
- తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
- శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
- 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు
- తిరుమల కొండపై ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేకుండా క్యూ లైన్లలోకి ప్రవేశించిన భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
నిన్న తిరుమల వెంకన్నను 64,214 మంది దర్శించుకున్నారు. 25,777 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. తిరుమలలో నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం లభించింది.
కాగా, తిరుమల కొండపై మూడ్రోజుల పాటు జరిగిన స్వామివారి పవిత్రోత్సవాలు నిన్నటితో ముగిశాయి. సంవత్సరం పొడవునా స్వామివారి సన్నిధిలో భక్తుల వల్ల, సిబ్బంది వల్ల తెలిసో, తెలియకో కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. తద్వారా కలిగే దోషాలను పోగొట్టేందుకు, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు.