చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ సహా పలు ఖనిజాలను గుర్తించిన రోవర్
- సల్ఫర్ ఖనిజాన్ని గుర్తించిన రోవర్‌లోని లిబ్స్ పరికరం
- అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్ కూడా గుర్తింపు
- హైడ్రోజన్ కోసం పరిశోధన జరుగుతున్నట్లు తెలిపిన ఇస్రో
జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు చేసిన ప్రజ్ఞాన్ రోవర్ పలు ఖనిజాలను గుర్తించింది. ఈ మేరకు ఇస్రో ప్రకటన చేసింది. రోవర్‌లోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం (లిబ్స్) చంద్రుడి దక్షిణ ధృవంపై సల్ఫర్ ఉనికిని గుర్తించినట్లు ఇస్రో తెలిపింది. అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్, ఆక్సిజన్‌ను గుర్తించింది. హైడ్రోజన్ కోసం పరిశోధన జరుగుతున్నట్లు ఇస్రో తెలిపింది. లిబ్స్ పరికరం బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. చంద్రుడిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు, రసాయన, ఖనిజాలను గుర్తించేందుకు లిబ్స్ పరికరాన్ని పంపించారు.