I.N.D.I.A. కూటమి రెండు సమావేశాలతో గ్యాస్ ధర రూ.200 తగ్గింది!: మమతా బెనర్జీ

  • సిలిండర్ గ్యాస్ ధరను రూ.200 తగ్గించిన కేంద్ర ప్రభుత్వం
  • ఉజ్వల పథకం కింద రూ.400 తగ్గనున్న భారం
  • ఇదే I.N.D.I.A. దమ్ము అంటూ గ్యాస్ తగ్గింపుపై మమతా బెనర్జీ ట్వీట్
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. సిలిండర్‌పై రూ.200 తగ్గించింది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందినవారికి సబ్సిడీ కింద ఇప్పటికే రూ.200 ఇస్తుండగా, ఈ తగ్గింపుతో వారికి రూ.400 ప్రయోజనం చేకూరనుంది. ఈ తగ్గింపుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సెటైర్లు వేశారు.

రెండు నెలల కాలంలో I.N.D.I.A. కూటమి కేవలం రెండు సమావేశాలు నిర్వహించిందని, ఈ రెండు సమావేశాల దెబ్బతో కేంద్రం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించిందన్నారు. ఇదే I.N.D.I.A. దమ్ము అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ట్వీట్ చేశారు.


More Telugu News