గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన కేంద్రం.. వారికైతే ఏకంగా రూ. 400 తగ్గింపు!
- ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు
- సిలిండర్ పై రూ. 200 తగ్గించిన కేంద్ర
- ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 400 తగ్గింపు
ఆకాశాన్నంటుతున్న వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వ భారీగా తగ్గించింది. ఒక్కో సిలిండర్ పై రు. 200 తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందిన వారికి కేంద్రం అదనంగా భారీ రాయితీని ప్రకటించింది. వీరికి మరో రూ. 200 తగ్గించింది. అంటే ఈ స్కీమ్ కింద ఉన్నవారికి ఒక్కో సిలిండర్ కు రూ. 400 తగ్గిందన్నమాట. రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ ఇస్తున్న బహుమతి ఇదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఉజ్వల పథకం ద్వారా మరో 75 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.