సెప్టెంబర్ 1న వస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు ఇవే!
- హాట్ స్టార్ కి వస్తున్న 'ది ఫ్రీలాన్సర్'
- జాన్ కొక్కెన్ ప్రధానమైన పాత్రను పోషించిన సిరీస్
- సోనీ లివ్ లో 'స్కామ్ 2003 .. ద తెల్గీ స్టోరీ'
- నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణం నేపథ్యంలో సాగే కథ
ఈ వారంలో వివిధ భాషలకి చెందిన వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్నాయి. ఓటీటీ సెంటర్స్ లో కాస్త గట్టిగానే సందడి కనిపించనుంది. హాలీవుడ్ .. బాలీవుడ్ వెబ్ సిరీస్ లు తమ జోరును కొనసాగించనున్నాయి. వాటిలో కొన్ని వెబ్ సిరీస్ లు తెలుగు వెర్షన్ లోను అందుబాటులోకి వస్తున్నాయి.
అలా చూసుకుంటే హాట్ స్టార్ లోని 'ది ఫ్రీలాన్సర్' వెబ్ సిరీస్, సోనీ లివ్ లోని 'స్కామ్ 2003' వెబ్ సిరీస్ ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న జాన్ కొక్కెన్ ప్రధాన కథానాయకుడిగా 'ది ఫ్రీలాన్సర్' నిర్మితమైంది. ఇందులో సీబీఐ ఆఫీసర్ గా కనిపించనున్న ఆయనకి హిందీలో తొలి వెబ్ సిరీస్. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక అదే రోజున సోనీ లివ్ లో 'స్కామ్ 2003 .. ద తెల్గీ స్టోరీ' స్ట్రీమింగ్ మొదలు కానుంది. 2003లో దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన నకిలీ స్టాంప్ పేపర్స్ కుంభకోణానికి సంబంధించిన కథ ఇది. అప్పట్లో ఓ జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆయన రాసిన 'రిపోర్టర్ కి డైరీ' ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రతీక్ గాంధీ ప్రధానమైన పాత్రను పోషించారు.