మండలి బుద్ధ ప్రసాద్ గృహ నిర్బంధం
- ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ బుద్ధ ప్రసాద్ నిరసన
- ఘంటసాల పీఎస్ వద్ద నిరసన దీక్షకు బయల్దేరిన టీడీపీ నేత
- ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు
టీడీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఘంటసాల పోలీస్ స్టేషన్ వద్ద నిరసన దీక్ష చేపట్టేందుకు ఆయన తన ఇంటి నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేని పోలీసులు... తనను గృహ నిర్బంధం చేయడం దారుణమని అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని... అయినా పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మరోవైపు బుద్ధ ప్రసాద్ ను హౌస్ అరెస్ట్ చేశారనే సమాచారంతో ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.